వచ్చే నెలలో APPSC ఉద్యోగాల భర్తీకి “వార్షిక ” పట్టిక జారీ
31 న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక భేటీ?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కి శుభవార్త వచ్చే నెల తొలివారంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పట్టికను ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.
ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సచివాలయంలో మంగళవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఆర్థిక శాఖ అధికారులు ఖాళీలపై స్పష్టమైన సమాచారాన్ని గురువారం నాటికి ఇవ్వాలని కోరారు.
డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy
ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉద్యోగ ఖాళీలు వార్షిక పట్టిక విడుదలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అప్స్సీ కార్యదర్శి psr ఆంజనేయులు వెల్లడించారు ఆ సమావేశంలో జరిగే నిర్ణయాన్ని అనుసరించి అప్పటినుంచి వారంలోగా వార్షిక పట్టికను జారీ చేస్తామని తెలియజేశారు