మార్చి నెలాఖరులో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు రాత పరీక్ష!
గ్రామ వార్డు సచివాలయంలో మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా మిగిలిపోయిన ఉద్యోగాలకి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసింది. ఈ రెండో విడత నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్షలు మార్చి నెలాఖరులో జరగనున్నాయి
ప్రశ్నపత్రం తయారీ నుంచి జవాబు పత్రాల మదింపు వరకు బాధ్యతలు ఎపిపిఎస్సికి అప్పగిస్తున్నారు, మొత్తం పరీక్షలను మూడు లేదా నాలుగు రోజుల్లో నిర్వహించి. వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించి అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ అయినా డి ఎస్ సి కి తదుపరి బాధ్యత అప్పగించనున్నారు.
14,061 ఉద్యోగాలకి గడువు ముగిసే నాటికి వచ్చిన దరఖాస్తులు 11,06, 614, వీటిలో కేటగిరి -1 ఉద్యోగాలు అయినా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సంక్షేమ విద్య సహాయకుల పోస్టులకు అత్యధికంగా4.56 లక్షల దరఖాస్తులు అందాయి. కేటగిరి-2 లోని గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ ఉద్యోగాలకి 1.14లక్షల దరఖాస్తులు, కేటగిరి-3 లోని డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు2,24, 667 దరఖాస్తులు అందాయి