గ్రామ/వార్డ్ సచివాలయం పరీక్ష తేదీల వివరాలు
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరి నెల 7 వరకు దరఖాస్తులను స్వీకరించి తప్పు జరిగింది.
ఈ ఉద్యోగాలకు మొత్తం11,06, 614 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ఉద్యోగాల నియామకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది
మొత్తం ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఒకవేళ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలను పరిశీలించి రాత పరీక్షల తేదీల పై స్పష్టమైన నిర్ణయం తీసుకుని వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.