How to apply apy scheme

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ఆడ పిల్లలు, సీనియర్ సిటిజన్స్, రైతులు, వెనకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం పలు స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. అసంఘటిత రంగంలోని ప్రజల ఆర్థిక భద్రత ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు తీసుకువస్తూ ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా వీటిల్లో ఒక భాగమే.

ఆటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా చేరారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 48 లక్షలుగా ఉన్న ఏపీవై స్కీమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 కోట్లకు పైగా చేరిందని పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది. అంటే మూడేళ్ల స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి? సింపుల్ ఆ స్కీమ్ ప్రయోజనాలు. ఈ పథకం గురించి తెలుసుకుంద్దాం

స్కీమ్‌ అర్హతలు ఇవే

అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలంటే భారతీయ పౌరులై ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. కనీసం 20 ఏళ్లపాటు చందా కొనసాగించాలి. ఆధార్‌లో లింకైన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. మొబైల్ నెంబర్ కూడా ఉండాలి.

పథకంలో ఎలా చేరాలి?

బ్యాంకులు ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకుకు వెళ్లి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్‌లో చేరొచ్చు. మీకు పథకంలో చేరిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

నెలకు ఎంత చెల్లించాలి?

నెలకు చెల్లించాల్సిన చందా మొత్తం వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మారుతుంది. మీరు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం రూ.42 చెల్లించాలి. అదే రూ.2,000 పెన్షన్‌కు రూ.84, రూ.3,000 పెన్షన్‌కు రూ.126, రూ.4,000 పెన్షన్‌కు రూ.168, రూ.5,000 పెన్షన్‌కు రూ.210 కట్టాలి. అదే మీరు 39 ఏళ్ల వయసులో పథకంలో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం రూ.264, రూ.5,000 పెన్షన్ కోసం రూ.1,318 చెల్లించాలి.
ప్రతి నెలా అకౌంట్‌లోకి

అటల్ పెన్షన్ యోజన డబ్బులు ప్రతి నెలా మీ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గానే డెబిట్ అవుతాయి. అందుకే అకౌంట్‌లో సరిపడినంత డబ్బులు ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ డబ్బులు కూడా నేరుగా మీ అకౌంట్‌లోకి వచ్చేస్తారు