• Fri. Oct 22nd, 2021

PM కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు 6,000 నుంచి 12,000 కు పెంపు?

Byadmin

Aug 27, 2020

రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6,000 అందిస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయంతో రైతుల ఆదాయం పెరగదని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

2016 ఆర్థిక సర్వే ప్రకారం.. 17 రాష్ట్రాల్లో రైతుల వార్షిక ఆదాయం కేవలం రూ.20 వేలు. వీరి ఆదాయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. రైతులకు అందించే ఆర్థిక సాయం కూడా పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.


స్విర్జర్లాండ్‌లో అయితే అక్కడి ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.లక్ష అందిస్తోందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సంపాల్ శాస్ట్రీ తెలిపారు. 2017లో ఈయన స్విర్జర్లాండ్ వెళ్లి అక్కడి వ్యవసాయ పద్ధతులు పరిశీలించి వచ్చారు. ఈయన సన్నకారు రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈయన మాత్రమే కాకుండా ఇంకా చాలా సంస్థలు పీఎం కిసాన్ డబ్బులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.



పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు అందించే డబ్బులను రూ.6,000 నుంచి రూ.15,000కు పెంచాలని స్వామినాథన్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కూడా అన్నదాతలకు సంవత్సరానికి రూ.12,000 అందజేయాలని కేంద్రానికి సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ కూడా పీఎం కిసాన్ డబ్బులను రూ.8,000కు పెంచాలని తన రీసెర్చ్ పేపర్‌లో పేర్కొన్నారు.
నేషనల్ ఫార్మర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుడు వినోద్ ఆనంద్ కూడా రైతులకు సంవత్సరానికి రూ.24,000 అందించాలని డిమాండ్ చేశారు. కిసాన్ శక్తి సంఘ్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర సింఘ్ రైతులకు నెలకు రూ.2,000 అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరి అభిప్రాయాలను, రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకొని పీఎం కిసాన్ డబ్బులు పెంచింతే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.