ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టిందా? ఇంట్లో ఆడ పిల్ల ఉంటే సంవత్సరానికి రూ.24 వేలు వస్తాయట. అంటే ఈ లెక్కన ప్రతీ నెలకు రెండు వేల రూపాయలు వస్తాయి. డైరెక్టుగా బ్యాంకులోనే ఆడపిల్లల పేరిట కేంద్రం డబ్బులను జమ చేస్తుందట.ఇది ఎంత వరకు నిజం?
‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వమే సంవత్సరానికి 24 వేల రూపాయలు ఇస్తుందంటూ’.. ఓ వార్త వాట్సాపుల్లో, పలు సోషల్ మీడియా యాప్స్‌లో తెగ ప్రచారం అవుతుంది. దీంతో ఈ వార్త నిజమేనని చాలా మంది నమ్మడమే కాకుండా మిగతా వారికి కూడా షేర్ చేస్తున్నారు.
ఈ మధ్య పలు ఫేక్ వార్తలు బాగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటివి నమ్మి ప్రజలు కూడా మోసపోతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని, ఎవరికీ షేర్ చేయవద్దని పేర్కొంది
అసలు నిజానికి ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరుతో ఎలాంటి ప్రభుత్వ పథకం లేదు. ఆ పథకం గురించి కేంద్రం ఎప్పుడూ.. ఎక్కడా పేర్కొనలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ అసత్యపు పథకం గురించి ప్రచారం జరుగుతూండటంతో.. పీబీఐ అంటే ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఈ న్యూస్‌ని ఖండించింది. ఇది పూర్తిగా తప్పుడు వార్తని పేర్కొంది. అసలు ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరుతో ఎలాంటి పథకం లేదని స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం రియల్ లేదా ఫేక్ అనేది పీబీఐ అంటే ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వటం జరిగింది ఈ లింక్ ని క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి ఈ పథకం అసలు ఉందా లేదా తెలుసుకోండి 👇
https://www.pib.gov.in/AdvanceSearch.aspx