• Mon. Oct 18th, 2021

Telangana State Government Announce 50,000 Government Jobs

Byadmin

Dec 14, 2020

తెలంగాణ రాష్ట్రము లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది.భారీ సంఖ్యలో ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్నీ శాఖలలోని పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలంగాణ “ముఖ్యమంత్రి KCR ” ప్రకటించారు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో అన్నీ శాఖల్లో కలుపుకొని దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక అంచనా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలు :

ప్రభుత్వ పాఠశాలలో 15,000 పైగానే ఉపాధ్యాయ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు

వ్యవసాయ శాఖలో 3,673

పశుసంవర్ధక శాఖలో 1,842

బీసీ సంక్షేమ శాఖలో 2,881

అటవీ శాఖలో 3,602

పోస్టులు, రెవిన్యూ శాఖలో 4,000 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన తరువాత నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది.