• Tue. Oct 19th, 2021

ఇంట్లో నుంచే మీ మొబైల్ ఫోన్ లో ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా

భారత ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు మొబైల్‌ ఫోన్‌ ద్వారానే డౌన్‌లోడ్‌ చేసుకునే నూతన విధానాన్ని తీసుకొచ్చింది

ఓటర్లు తమ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ద్వారా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవడంతో పాటు ఫోన్‌లోనూ స్టోర్‌ చేసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించింది

క్రితం వరకు ఓటర్లు గుర్తింపు కార్డు కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరిగి పొందాల్సి ఉండేది. ఐతే నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ-ఎపిక్‌(ఎలక్రానిక్‌ ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది

ఓటర్లు తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌లోనే ఓటరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని ఎక్కడైనా ప్రింట్‌ తీసుకోవచ్చు

2021 జనవరిలో విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్‌ ద్వారా జనవరి 25 నుంచి కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఫిబ్రవరి 1 నుంచి మిగిలిన పాత మరియు కొత్త ఓటర్లందరూ “ఈ-ఎపిక్‌” కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. “ఈ-ఓటర్‌ హువా డిజిటల్‌, క్లిక్‌ ఫర్‌ ఏపిక్”‌ అనే పేరుతో పేద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది అలాగే కింద ఉన్న లింక్స్ ఫై క్లిక్ చేసి మీ ఓటర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోండి

ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ లింక్స్ 👇

Link -1 : http://voterportal.eci.gov.in

Link -2 : NVSP: https://nsvp.in