YSR చేయూత అప్లికేషన్ ఫామ్ ఫ్రీ డౌన్లోడ్

Ysr చేయూత పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోక పోయిన , వాలంటీర్స్ మీ పేరు నమోదు చేయక పోయిన కింద ఉన్న లింక్ క్లిక్ వైఎస్సార్ చేయూత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసికొని మీ ఏరియా సచివాలయం లేదా వాలంటీర్ కి అందించి మీ పేరులు నమోదు చేసుకోండి. అలాగే ప్రభుత్వం కొత్తగా మరికొంతమంది మహిళలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది వాళ్లు ఎవరంటే

60 ఏళ్లలోపు ఉన్న వివిధ వర్గాల మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. వీరిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత కార్మికులు, మత్స్యకార మహిళలూ ఉన్నారు. వీరు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నేపథ్యంలో మానవతా దృక్పథంతో సీఎం జగన్‌ వీరికి కూడా ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా లబ్ధి కలిగించాలని నిర్ణయించారు.

దీంతో వైఎస్సార్‌ చేయూత విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం వల్ల దాదాపుగా 8.21 లక్షల మంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత కారణంగా ప్రయోజనం చేకూరనుంది. ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది

CLICK BELOW LINK AND DOWNLOAD YSR CHEYUTHA APPLICATION FORM 👇

https://drive.google.com/file/d/1Zf27e_CzGP_GbUEI5DPspH3fv7XHM7gl/view?usp=drivesdk