వైఎస్సార్ చేయూత ద్వారా సాయాన్ని అందుకుని వివిధ వ్యాపారాలు, ఉపాధి మార్గాల్లో పెట్టుబడిపెట్టడం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వారాల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలను అందించనున్న ప్రభుత్వం తొలి విడత సాయాన్ని ఇప్పటికే అందచేసిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ. 1.60 లక్షల వరకు తాకట్టు లేని రుణాన్ని బ్యాంకుల నుంచి ఇప్పించడం లేదా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పించే ప్రక్రియలో వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు తోడ్పాటు అందించనున్నట్లు గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తోడ్పాటును అందుకునేందుకు ఇప్పటివరకు దాదాపు 19.61 లక్షల మందికిపైగా మహిళలు ముందుకొచ్చారు. ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల తోడ్పాటుతో చేయూత లబ్ధిదారులు అక్టోబరు 6వ తేదీ కల్లా వ్యాపార, ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకునేలా కార్యాచరణ సిద్ధం.
► ఆసక్తి చూపిన లబ్ధిదారుల వివరాలను ఈ నెల 29వ తేదీ నాటికి సంబంధిత శాఖలకు పంపనున్నారు. అధికారులు వీటిని పరిశీలించి సెప్టెంబరు 6వ తేదీ నాటికి
ప్రముఖ కంపెనీలతో పాటు బ్యాంకులకు ఆ వివరాలు పంపుతారు. లబ్ధిదారుల వారీగా వ్యాపార మోడళ్లను రూపొందిస్తారు.
► సెప్టెంబరు 21వ తేదీ నాటికల్లా వ్యాపార, ఉపాధి కార్యక్రమాల నిర్వహణలో అదనపు ఆర్థిక సహాయం అవసరమైన లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి సహకారం,
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 6వ తేదీ కల్లా సాయాన్ని అందచేస్తారు.
Ysr చేయూత జీవనోపాధి ద్వారా 56,000 /-రూ ఆర్థిక సహాయం పొందాలి అనుకున్న మహిళలు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి 👇
https://drive.google.com/file/d/1oishXmip5s5tiEWptSBUCpySYT_2HCur/view?usp=drivesdk