
4 లక్షల పింఛన్ లు తొలగింపు
కొత్తగా పెన్షన్ కి దరఖాస్తుల ఆహ్వానం
అర్హత ఉంటే ఐదు రోజుల్లోనే పెన్షన్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 4,27, 538 మంది పెన్షన్ దారులని తొలగించడంతో పెన్షన్ దారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అర్హత ఉన్న పెన్షన్ దారుల కి పెన్షన్ ఇవ్వకపోవటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
వీటిపై స్పందించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్తగా 6.11 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని. పెన్షన్లు అందని వారు ఎవరైనా అందుకోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని దానిని పరిశీలించి అర్హులు అయితే వారికి ఐదు రోజుల్లో పెన్షన్ ని మంజూరు చేస్తామని చెప్పారు.
మంగళవారం ఆయన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పెన్షన్ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాల కి తగ్గించడం జరిగిందని. అలాగే “45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు చెందిన మహిళకు వచ్చే సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల్లో 75 వేలు అందిస్తామని తెలిపారు