YSR ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్-2020 సీజన్ కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నేడు రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది.
నేడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు.
రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాలతోపాటు 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
YSR ఉచిత పంటల భీమా స్టేటస్ కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇
http://karshak.ap.gov.in/ekarshak/distWise_cropinsurance.jsp
ఈ -క్రాప్ బుకింగ్ స్టేటస్ కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇
http://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp
ఇన్పుట్ సబ్సిడీ స్టేటస్ కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇
https://ysrrythubharosa.ap.gov.in/INSSTATUS/RB/inputsubsidystatus
PM KISAN PAYMENT STATUS CHECKING
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో 7236 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
How to check Dwakra Runa MAFI ELIGIBLE STATUS