ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ysr వాహన మిత్రా పథకం లో భాగంగా 2020 వ సంవత్సరానికి సంబంధించి సొంత వాహనం ఉన్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవ్ లకు ఉచితంగా జూన్ 4 నుంచి వాహన దారులకి 10,000 వారి అకౌంట్ లో జమచేయనుంది
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు మే 18 నుంచి మే 26 తేది వరకు వాలంటీర్ ల ద్వారా స్థానిక సచివాలయాల లో దరఖాస్తు చేసుకోవచ్చు
దరకాస్తు చేసుకోవడానికి కావలసిన డాకుమెంట్స్
1.మోటార్ వెహికల్ లైసెన్స్
2.వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
3.తెల్ల రేషన్ కార్డ్
4.ఆధార్ కార్డ్
5.బ్యాంక్ పాస్ బుక్
పైన తెలిపిన డాకుమెంట్స్ జెరాక్స్ ని అప్లికేషన్ ఫామ్ తోపాటు జత చేసి సచివాలయం లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగె దరఖాస్తు చేసుకొనే సమయానికి వాహనం రిజిస్ట్రేషన్ దరఖాస్తు దారుని పేరు మీద రిజిస్ట్రేషన్ ఐ ఉండాలి ఇతర సందేహాల కొరకు 1902 నెంబర్ కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుస్కోవచ్చు